పోప్‌.. పరుగులు చేయాలని చూడకు ఆ సమయాన్ని ఆస్వాదించు: కోహ్లీ

లండన్‌: ‘ఎక్కువ పరుగులు చేయాలని చూడకు. ఆ సమయాన్ని బాగా ఆస్వాదించు’ అని ఇంగ్లాండ్‌ ఆటగాడు పోప్‌కు విరాట్‌ కోహ్లీ సలహా ఇచ్చాడు. ఎందుకంటే 20 ఏళ్ల పోప్‌ ఈ రోజు భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో పోప్‌ను ఉద్దేశించి కోహ్లీ సరదాగా వ్యాఖ్యానించాడు.

పోప్‌ అరంగేట్రం గురించి ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కోహ్లీ పైవిధంగా స్పందించాడు. ‘ఈ సందర్భంగా నేను పోప్‌కు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. జాతీయ జట్టుకు ఆడాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. నీ కెరిర్‌లో ఎప్పటికీ మరిచిపోలేని ఘటన ఇది. అందుకే ఈ మ్యాచ్‌ను బాగా ఎంజాయ్‌ చేయ్‌. అంతేకానీ, ఎక్కువ పరుగులు చేయాలని మాత్రం అనుకోకు. పోప్ బ్యాటింగ్‌ను ఇప్పటివరకు చూడలేదు. ఒకవేళ అతడికి తుది జట్టులో చోటు దక్కితే అదృష్టంగా భావించాలి’ అని కోహ్లీ అన్నాడు.

లార్డ్స్‌ వేదికగా భారత్‌తో జరిగే రెండో టెస్టులో పోప్‌ ఆడతాడని ఇంగ్లాండ్‌ సారథి రూట్‌ ఇప్పటికే స్పష్టం చేశాడు. తొలి టెస్టులో ఆడిన మలన్‌, స్టోక్స్‌పై వేటు వేసిన ఇంగ్లాండ్‌ వారి స్థానంలో పోప్‌, వోక్స్‌ను జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *