అది చిన్నప్పటి నుంచి చేస్తున్నా: విరాట్‌కోహ్లీ

లండన్‌: టీమిండియా సారథి విరాట్‌కోహ్లీ ట్విటర్‌లో ఓ ఫొటో షేర్‌ చేశాడు. విచిత్ర ఫోజు గల ఆ ఫొటో ఇప్పుడు అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌ X పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వర్షం కోసం ఎదురు చూసే ఫోజిచ్చాడు. అందులో నడుముపై రెండు చేతులు ఆనించి మబ్బులవైపు చూస్తున్నాడు. అదే ఫోటోతో పాటు తన చిన్నప్పటి అదే ఫోజులోని మరో ఫొటోని జతచేశాడు. ‘1990ల నాటి నుంచి ఇదే చేస్తున్నా’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్‌పై 89 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్‌శర్మ(140) అద్భుత శతకంతోపాటు కోహ్లీ (77), కేఎల్‌ రాహుల్‌(57) అర్ధశతకాలతో రాణించడంతో భారత్‌ తొలుత 336/5 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాక్‌ నిర్ణీత ఓవర్లలో 212/6తో నిలిచింది. దీంతో డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో కోహ్లీసేన 89 పరుగులతో విజయం సాధించింది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లకి రెండు రోజుల విశ్రాంతి దొరికింది. తదుపరి మ్యాచ్‌ అఫ్గానిస్థాన్‌పై శనివారం జరగాల్సి ఉండటంతో ఆటగాళ్లకి రెండు రోజుల విశ్రాంతి ఇచ్చినట్లు జట్టు మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *