అవి మాటలు కావు.. గుండెను తాకే అస్త్రాలు!


ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యిక దేశానికి ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయాల్లో నిత్యం తలమునకలుగా ఉన్నా, తన ఇష్టమైన కవితా వ్యాసంగాన్ని వదలిపెట్టలేదు. పార్లమెంటు లేదా బహిరంగసభల్లో లేదా పార్టీ సమావేశాల్లో నిత్యనూతనమైన ఛలోక్తులు విసిరేవారు. ఆయనే మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ. ప్రతిపక్షనేతలు సైతం ఆయన వాగ్దాటికి ముగ్ధులయ్యేవారు. అటల్‌జీ మాటల్లోని కొన్ని ఆణిముత్యాలు..

‘‘ మన సమస్యలను తుపాకులు పరిష్కరించలేవు. కేవలం సోదరత్వమే కాపాడుతుంది.’’

‘‘ జాతీయ భద్రతతో దేశం ఎన్నడూ రాజకీయాలు చేయలేదు.’’

‘‘ మన విలువైన వనరులను యుద్ధాల పేరుతో వృథా చేస్తున్నాం.. నిరుద్యోగం, దారిద్ర్యం, వెనుకబాటుతనాలపై నిజంగా యుద్ధాలు చేయాల్సివుంది.’’

‘‘ రాజకీయాలకంటే దేశ ప్రయోజనాలకే నా ప్రాధాన్యం. అదే భారత దేశ ప్రజాస్వామ్య వినూత్నమైన బలం.’’

‘‘ భారత్‌కు లౌకికవాద లక్షణాలు లేకపోతే ఒక దేశమే కాదు.’’

‘‘ గెలుపు ఓటములు జీవితంలో ఒక భాగమే వాటిని సమానదృష్టితో చూడాలి.’’

‘‘ మన స్నేహితులను మార్చుకోగలం కానీ పొరుగవారిని మార్చలేం కదా.’’

‘‘ నాకు ఒక క‌ల‌ ఉంది. ఆకలి, నిరక్షరాస్యత నుంచి భారత్‌ విముక్తి పొందగలదని.’’

‘‘ భారత్‌లో ఎవరూ ఒంటరి అని అనుకోకూడదు. భారతీయులందరూ అతనికి చేయూతగా ఉన్నారని తెలియజేయాలి.’’

‘‘ ఎన్నికల్లో గరీబీ హఠావో లాంటి నినాదాలు చేసి విజయం సాధించవచ్చు. అయితే నినాదాలు పేదరికాన్ని తొలగించలేవు.’’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *