వాజ్‌పేయీకి ప్రముఖుల నివాళి…

దిల్లీ: తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీకి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మూత్రపిండ నాళాల ఇన్ఫెక్షన్‌, మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌, ఛాతీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం 5.05 గంటలకు మృతిచెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన పార్థివదేహాన్ని దిల్లీలోని కృష్ణమీనన్‌ మార్గ్‌కు తరలించారు. వాజ్‌పేయీని కడసారి చూసేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివస్తున్నారు. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతకు నివాళులర్పిస్తున్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్లు పి.సదాశివం, భన్వరీలాల్‌ పురోహిత్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, నేవీ చీఫ్‌ సునీల్‌ లాంబా, ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తదితరులు మాజీ ప్రధానికి నివాళులర్పించారు.

వాజ్‌పేయీ అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు్ల చేస్తోంది. ఆయన పార్థివదేహాన్ని కాసేపట్లో భాజపా ప్రధాన కార్యాలయానికి తరలించున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వాజ్‌పేయీ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాజ్‌పేయీ మృతి నేపథ్యంలో కేంద్రం ఈ నెల 22 వరకు సంతాప దినాలుగా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *