ప్రభుత్వ లాంఛనాలతో వాజ్‌పేయీ అంత్యక్రియలు…నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని

మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంత్యక్రియలు అభిమానులు, సన్నిహితుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అటల్‌ దత్తపుత్రిక నమిత .. వాజ్‌పేయీ చితికి నిప్పంటించగా, హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, త్రివిధ దళాధిపతులు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్‌ నేతలు అడ్వాణీ సహా పలువురు స్మృతి స్థల్‌లో మహానేతకు నివాళులర్పించారు.అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, నితిన్‌ గడ్కరీ, హర్షవర్ధన్‌, స్మృతి ఇరానీ, అశోక్‌ గెహ్లాట్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌, భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి, తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

కాలినడకన మోదీ, అమిత్‌ షా
అంతకుముందు అశేష జనవాహిని నడుమ భాజపా ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రీయ స్మృతిస్థల్‌కు వాజ్‌పేయీ అంతిమయాత్ర కొనసాగింది. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీంతో దిల్లీ వీధులు కిక్కిరిశాయి. నాలుగు కిలోమీటర్లు సాగిన ఆత్మీయ నేత అంతిమయయాత్రలో ప్రధాని మోదీ, అమిత్‌షా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, దేవేంద్ర ఫడణవీస్‌ కాలినడకన పాల్గొన్నారు. అంతిమ యాత్ర సాగుతున్నంతసేపూ అటల్‌ జీ అమర్‌ రహే నినాదాలు మార్మోగాయి.

LIVE : Last rites of former PM Atal Bihari Vajpayee Ji from BJP HQ to Rashtriya Smriti Sthal, Delhi. #AtaljiAmarRahen

Posted by Bharatiya Janata Party (BJP) on Friday, August 17, 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *