ఎమ్మెల్యేల భవన సముదాయం ప్రారంభం..

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు, మండలి సభ్యులకు, వారి సహాయకులు, సిబ్బంది కోసం రాజధాని హైదరాబాద్‌లో అత్యాధునిక వసతులతో నిర్మించిన నివాస గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. హైదర్‌గూడలో జరిగిన ఈ కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
మొత్తం 4.26 ఎకరాల విస్తీర్ణంలో రూ. 166 కోట్లతో ఈ నివాస సముదాయాన్ని నిర్మించారు. ఎమ్మెల్యేలకు ఆదర్శనగర్‌లో, హైదర్‌గూడలో పాత గృహసముదాయాలున్నాయి. అవి శిథిలావస్థకు చేరడంతో 2012లో కొత్త వాటి నిర్మాణం చేపట్టారు. ఆటంకాలన్నింటినీ అధిగమించి ఇప్పటికి నిర్మాణాలు పూర్తయ్యాయి.

⇒ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 120 ఫ్లాట్లను నిర్మించారు. ఒక్కో ఫ్లాట్‌ 2500 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. 12 అంతస్తులతో కూడిన అయిదు బ్లాక్‌లను నిర్మించారు. ఒక్కో అంతస్తుకు 10 చొప్పున ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కో ఫ్లాట్‌లో పెద్దల పడకగది, పిల్లల పడక గది, కార్యాలయం, వంట గది, సరుకుల నిల్వగది ఉన్నాయి.
⇒ సహాయకులకు 120 ఫ్లాట్లను నిర్మించారు. ఒక్కో ఫ్లాట్‌ 325 చదరపు అడుగులు ఉంటుంది.
⇒ సిబ్బందికి 36 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాటు వేయి చదరపు అడుగులతో ఉంటుంది.
⇒ ఐటీ, మౌలిక సౌకర్యాల కోసం 1.25 లక్షల చదరపు అడుగులతో ప్రత్యేకంగా బ్లాక్‌ను నిర్మించారు.
⇒ ఒక భద్రత కార్యాలయాన్ని నిర్మించారు.
⇒ మొత్తం ఎనిమిది లిఫ్టులున్నాయి.
⇒276 కార్ల పార్కింగు వసతి ఉంటుంది.
⇒ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సందర్శకులతో సమావేశాల కోసం ప్రత్యేకంగా 23 గదులు ఉన్నాయి
⇒ ప్రాంగణంలో క్లబ్‌ హౌస్‌, వ్యాయామశాల, సూపర్‌ మార్కెట్‌ ఉన్నాయి. ఎమ్మెల్యేల నివాస సముదాయానికి భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *