‘సవ్యసాచి’ టీజర్‌ విడుదల…


హైదరాబాద్‌: అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. కాగా..సోమవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో.. ‘మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములు అంటారు. అదే ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకుని పుడితే దానిని అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని, వరుసకి కనిపించని అన్నని, కడదాకా ఉండే కవచాన్ని, ఈ సవ్యసాచిలో సగాన్ని’ అని నాగచైతన్య చెప్తున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది.

భారతంలో అర్జునుడిలాగా… రెండు చేతులకీ సమానమైన బలమున్న వ్యక్తిగా ఇందులో నాగచైతన్య కన్పించనున్నారు. మాటలతో కాకుండా… రెండు చేతులతో ఏమేం చేశాడు? అన్నది ‘సవ్యసాచి’ కథ. మాధవన్‌, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్‌, సత్య, రావు రమేష్‌ తదితరుల పాత్రలు ఆకట్టుకుంటాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగచైతన్య. ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *