ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి…!!


మగళవారం సాయంత్రం జరిగిన ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జూనియర్ తన తండ్రి హరికృష్ణను గుర్తుకు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనైన పరిస్తుతులను చూసి జూనియర్ తన తండ్రి అకాల మరణం షాక్ నుండి ఏమాత్రం తెరుకోలేకపోయాడు అన్న విషయం స్పష్టమైంది. ఈ పరిస్తుతులను చూసిన జూనియర్ సన్నిహితులు అతడిని ‘అరవింద సమేత’ విడుదల తరువాత ఒక నెల రోజులు అతడి బెంగ పూర్తిగా తీరడానికి సినిమాల విషయాలకు దూరంగా తన కుటుంబ సభ్యులతో ఏదైనా విదేశాలకు వెళ్ళమని సూచించినట్లు తెలుస్తోంది.

ఈ సలహా జూనియర్ కు కూడ బాగా నచ్చడంతో ‘అరవింద సమేత’ విడుదలైన తరువాత ఆమూవీ పోస్ట్ ప్రమోషన్ పనులను పూర్తి చేసి ఒకనెల రోజుల హాలిడే ట్రిప్ కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి జూనియర్ రాజమౌళి తీయబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించిన మేకవర్ పై నవంబర్ నుండి దృష్టి పెట్టవలసి ఉంది.

అయితే ఇప్పుడు జూనియర్ ఈ నిర్ణయం తీసుకుని రాజమౌళి బందిఖానాకు వెళ్ళే విషయంలో ఒక నెలరోజులు ముందుగానే గ్యాప్ అడుగుతున్న పరిస్థుతులలో ప్రస్తుత పరిస్థుతులను బట్టి రాజమౌళి ఆలోచనలలో మార్పులు వచ్చినట్లు టాక్. జూనియర్ తన షాక్ నుండి పూర్తిగా తెరుకోకుండా అతడిని బలవంత పెట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన వర్క్ షాప్ అదేవిధంగా జూనియర్ మేకోవర్ కు సంబంధించిన పనులను నవంబర్ నుండి కాకుండా డిసెంబర్ నుండి మొదలు పెట్టాలని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *