శతకంతో అదరగొట్టిన పృథ్వీ షా…

రాజ్‌కోట్‌: వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్‌ పృథ్వీషా అదరగొట్టాడు. అరంగేట్ర టెస్టులోనే శతకం సాధించాడు. ఓపెనర్‌గా క్రీజులో వచ్చిన పృథ్వీ.. కేవలం 99 బంతుల్లోనే 15 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. మరోవైపు అర్ధశతకం పూర్తిచేసిన పుజారా (67 నాటౌట్‌) పృథ్వీకి మంచి సహకారాన్ని అందిస్తున్నాడు. 32 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 175 పరుగులు చేసింది.

రికార్డుల షా..

దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన షా 18 ఏళ్లకే జాతీయ జట్టు తలుపులు తట్టాడు. విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టే అతడికి అరంగ్రేటం మ్యాచ్‌. ఎన్నో అంచనాల మధ్య క్రీజులోకి అడుగుపెట్టిన అతడు వన్డే తరహాలో పరుగుల వరద పారించాడు. తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించిన 15వ భారత ఆటగాడిగా నిలిచాడు. తద్వారా గంగూలీ, సెహ్వాగ్‌ తదితర దిగ్గజాల సరసన చేరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *