ఫన్నీగా ‘ప్రేమకథా చిత్రమ్‌ 2’ ట్రైలర్‌

హైదరాబాద్‌: సుమంత్‌ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమకథా చిత్రం 2’. హరి కిషన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విమెన్స్‌ డేను పురస్కరించుకుని చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. 2013లో వచ్చిన ‘ప్రేమకథా చిత్రానికి’ ఇది సీక్వెల్‌గా రాబోతోంది. ట్రైలర్‌లో నందితా శ్వేత దెయ్యంలా ప్రవర్తిస్తూ ఇతరులను భయపెట్టడం ఫన్నీగా ఉంది. సుమంత్‌, నందిత ప్రేమించుకుంటారు. సుమంత్‌.. సిద్ధి ఇద్నానీని కూడా ప్రేమిస్తాడు. ఓరోజు ఈ విషయం నందితకు, సిద్ధికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? నందిత దెయ్యంలా ఎందుకు మారింది? అన్నదే కథ. జీవన్‌ బాబు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్‌పీఏ క్రియేషన్స్‌ బ్యానర్‌పై సుదర్శన్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *