రూ.91 దాటిన పెట్రోల్‌ ధర…

ముంబయి: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధర ఏకంగా రూ.91 దాటిపోయింది. ఈరోజు నగరంలో లీటరు పెట్రోల్‌ ధర 30పైసలు పెరిగి రూ.91.08గా ఉంది. లీటర్‌ డీజిల్‌ ధర కూడా 32పైసలు పెరిగి రూ79.72గా ఉంది. రాజధాని దిల్లీ నగరంలో ఈరోజు లీటరు పెట్రోల్‌ ధర 24పైసలు పెరిగి రూ.83.73గా ఉంది. లీటరు డీజిల్‌ ధర రూ.75.09గా ఉంది.

దిల్లీలో సహజవాయువు ధరలు కూడా పెరిగాయి. దీని కారణంగా ప్రస్తుతం రాయితీ గల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.502.4కు చేరింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో దేశీయ ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ పోతున్నాయి. అలాగే డాలరుతో పోలిస్తే రూపాయి క్షీణించడం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణమవుతోంది. దిల్లీలో రాయితీ లేని వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర ఆదివారం ఒకేసారి రూ.59 పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి పెట్రోల్‌ ధరలు 8శాతం పెరగగా, డీజిల్‌ ధరలు 10శాతం పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *