కుల్‌దీప్‌ మాయ చేస్తే బంతి తిరగాల్సిందే…

పాకిస్థాన్‌ వికెట్లు ఎలా పడ్డాయో చూడండి


మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత జైత్ర యాత్ర కొనసాగుతోంది. వరుసగా ఏడు విజయాలు సొంతం చేసుకొని టీమిండియా ఆధిపత్యం నిలబెట్టుకొంది. ఆదివారం జరిగిన పోరులో కోహ్లీసేన 89 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను బ్యాట్స్‌మెన్‌ భారత బౌలర్లు కట్టడి చేసిన విధానం అద్భుతం. ముఖ్యంగా కుల్‌దీప్‌ మాయ చేస్తే ఎలా ఉంటుందో ఈ మ్యాచ్‌లో మరోసారి రుజువైంది. 24వ ఓవర్‌లో అజామ్‌ను ఔట్‌ చేసిన బంతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆఫ్‌సైడ్‌ వేసిన బంతి గిర్రున తిరిగి వికెట్లను చెదరగొట్టడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అక్కడితో ప్రారంభమైన పాకిస్థాన్‌ వికెట్ల పతనం ఎలా ఉందో ఓసారి ఇక్కడ వీక్షించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *