ముకేశ్‌ అంబానీ.. వరుసగా 11వ సారి…


దిల్లీ: భారత్‌లో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. 2018 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన ‘భారత సంపన్నుల జాబితా’లో వరుసగా 11వ ఏడాది ముకేశ్ ప్రథమ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం ఈయన సంపద రూ. 3.49లక్షల కోట్లు. ఈ ఒక్క ఏడాదే ముకేశ్‌ సంపద రూ. 68వేల కోట్లు పెరిగింది.

ఈ జాబితాలో విప్రో ఛైర్మన్‌ అజిమ్‌ ప్రేమ్‌జీ రెండో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ రూ. 1.55లక్షల కోట్లు. ఇక రూ. 1.35లక్షల కోట్లతో ఏర్సెలార్‌ మిత్తల్‌ ఛైర్మన్‌ లక్ష్మీ మిత్తల్‌ మూడో స్థానంలో నిలిచారు.

మొత్తం 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్‌ జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది వీరి మొత్తం సంపద 492 బిలియన్‌ డాలర్లు. ఈ 100 మంది కుబేరుల్లో 11 మంది సంపద ఈ ఏడాది 1 బిలియన్‌ డాలర్లకు పైగా పెరిగిందని ఫోర్బ్స్ ఇండియా తెలిపింది. ఇక ఈ ఏడాది కేవలం నలుగురు మహిళలు మాత్రమే ఫోర్బ్స్‌ జాబితాలో చోటుదక్కించుకున్నారు. వీరిలో బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా ఒకరు. ఈమె సంపద విలువ రూ. 26వేల కోట్లు. ఈ జాబితాలో కిరణ్‌ 39వ స్థానంలో ఉన్నారు.

ఫోర్బ్స్‌ టాప్‌ 10 భారత సంపన్నులు వీరే..

1. ముకేశ్‌ అంబానీ(రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌)

2. అజిమ్‌ ప్రేమ్‌జీ(విప్రో)

3. లక్ష్మీ మిత్తల్‌(ఏర్సెలార్‌ మిత్తల్‌)

4. హిందుజా బ్రదర్స్‌(అశోక్‌ లేల్యాండ్‌)

5. పల్లోంజీ మిస్త్రీ(షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌)

6. శివ్‌ నాడార్‌(హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌)

7. గోద్రేజ్‌ కుటుంబం(గోద్రేజ్‌ గ్రూప్‌)

8. దిలీప్‌ సంఘ్వీ(సన్‌ఫార్మా ఇండస్ట్రీస్‌)

9. కుమార్‌ బిర్లా(ఆదిత్య బిర్లా గ్రూప్‌)

10. గౌతమ్‌ అదానీ(అదానీ పోర్ట్స్‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *