మహేశ్‌కు శుభాకాంక్షల వెల్లువ‌…

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఈరోజు తన 43వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి మహేశ్‌కు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మహేశ్‌ పుట్టినరోజుకు 50 రోజుల ముందు నుంచే అభిమానులు సంబరాలు మొదలుపెట్టేశారు. తన అభిమానుల కోసం మహేశ్‌ మాటిచ్చినట్లుగా తన 25వ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌తో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

మోహన్‌లాల్‌: హ్యాపీ బర్త్‌డే సూపర్‌స్టార్‌ మహేశ్‌

ఎన్టీఆర్‌: హ్యాపీ బర్త్‌డే మహేశ్‌ అన్నా.. మీకు ఈ ఏడాది గొప్పగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.

కేటీఆర్: సూపర్‌స్టార్, నా ప్రియమైన స్నేహితుడు మహేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు.

నాగబాబు: పుట్టినరోజు శుభాకాంక్షలు మహేశ్‌. ‘మహర్షి’ సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌

సుశాంత్‌: వావ్‌.. ఫస్ట్‌లుక్‌లో ఫ్రెష్‌గా, ఛార్మింగ్‌గా కనిపిస్తున్నారు. ఈ హ్యాండ్సమ్‌ స్టూడెంట్‌కు హ్యాపీ బర్త్‌డే

మారుతి: మన సూపర్‌స్టార్‌ మహేశ్‌కు పుట్టినరోజు శుభాకంక్షలు. ‘మహర్షి’ లుక్‌ అదిరింది.

అల్లరి నరేశ్‌: ఈ ‘రవి’ నుంచి ‘రిషి’కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను సర్‌. ‘మహర్షి’ సినిమాలో నేనూ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదో మైలురాయి.

ఈషా రెబ్బా: టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో హ్యాండ్సమ్‌ ప్రిన్స్‌ మహేశ్‌బాబుకు హ్యాపీ బర్త్‌డే.

అనిల్‌ రావిపూడి: అన్నా..ఫస్ట్‌లుక్‌ అదిరింది. హ్యాపీ బర్త్‌డే మహేశ్‌ గారు.

రకుల్‌ ప్రీత్‌: హ్యాపీ బర్త్‌డే ఎవర్‌గ్రీన్‌ వన్‌ అండ్‌ ఓన్లీ మహేశ్‌ బాబు. బ్లాక్‌బస్టర్‌ సినిమాతో మీకు ఈ ఏడాది ప్రారంభం కావాలని ఆశిస్తున్నాను.

గోపీచంద్‌ మలినేని: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘మహర్షి’ ఫస్ట్‌లుక్‌ అదిరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *