వైసీపీలోకి వలసలు….నిన్న జేసీ అనుచ‌రుడు నేడు కాల్వ అనుచ‌రుడు

 

మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు హ‌యాం నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న వ‌ర‌కూ అనంత‌పురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసందే. అయితే ప్ర‌స్తుత రాజ‌కీయ పరిస్థితితుల‌ను బట్టి చూస్తుంటే టీడీపీ కంచుకోట‌కు బీట‌లు వాలే ప‌రిస్థితి ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలుస్తోంది.

ఇక ఇప్ప‌టికే మంత్రి ప‌రిటాల సునీత నియోజ‌క‌వ‌ర్గం అయిన రాప్తాడు లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఒక స‌ర్వేను నిర్వహించార‌ట.ఈ స‌ర్వేలో మంత్రి సునీత ప‌రిపాల‌న‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక, సామాజికప‌ర‌మైన అంశాల‌ను దృష్టిలో ఉంచుకుని రాప్తాడులో స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో ప‌లు కీల‌క ఆధారాలు బ‌య‌టప‌డ్డాయి. ఇప్ప‌టికిప్పుడు రాప్తాడులో ఎన్నిక‌లు జ‌రిపితే టీడీపీ మంత్రి ప‌రిటాల సునీత‌పై వైసీపీ నాయ‌కులు తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి అత్య‌ధిక మెజారిటీతో గెలిచే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని ఈ స‌ర్వే తెలిపింది.

ఇక దీంతో పాటు మంత్రి కాల్వ శ్రీనివాసులు నియోజ‌కవ‌ర్గం రాయ‌దుర్గంలో కూడా చంద్ర‌బాబు ఒక స‌ర్వేని నిర్వ‌హించారు. ఈ స‌ర్వేలో కూడా మంత్రికి వ్య‌తిరేకంగానే రిజ‌ల్స్ వ‌చ్చాయి. దీంతో ఆగ్ర‌హించిన చంద్ర‌బాబు, వెంట‌నే కాల్వ శ్రీనివాసుల‌ని, ప‌రిటాల సునీత‌ని అమ‌రావ‌తికి రావాల‌ని పిలిపించుకుని క్లాస్ తీసుకున్న‌రాట‌. ఇంకా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సుమారు ఏడాది కాలం వ్య‌వ‌ధి ఉన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు టీడీపీ వైపు వ‌చ్చేలా చేయాల‌ని చంద్ర‌బాబు సూచించార‌ట‌. అలా చేయ‌లేని నేప‌థ్యంలో 2019 ఎన్నిక‌ల్లో టికెట్ ఆసించ‌కూడ‌ద‌ని చంద్ర‌బాబు వారిని హెచ్చ‌రించారట‌.

ఇక ఇదే ఫ‌లితాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ప‌లువురు టీడీపీ నాయ‌కులు వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ద‌య‌మ్మారు. ఇప్ప‌టికే అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు కోగ‌టం విజ‌య భాస్క‌ర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్ధం తీసుకున్నారు.

ఇక తాజాగా కాల్వ శ్రీనివాసులు ప్రధాన అనుచరుడు నారాయణస్వామి చౌదరి వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఎన్నో సంవ‌త్స‌రాలుగా ప్ర‌ధాన అనుచ‌రుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న నారాయణస్వామి చౌదరి వైసీపీలో చేర‌డంతో కాల్వ శ్రీనివాసులును షాక్ కి గురిచేసింద‌న‌డంలో ఏమాత్రం సందేహ‌లేదు. ఎందుకంటే అత‌ని ఆధీనంలో అనేక మంది టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. ఈ క్రమంలో ఆయ‌న వైసీపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి సమక్షంలో పార్టీ కండువా క‌ప్పుకోవ‌డంతో టీడీపీ కార్య‌క‌ర్తలు కూడా వైసీపీ వైపు తిరిగే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంది. దీంతో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి గ‌ట్టి పోటీ త‌గిలే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *