జిల్‌ జిల్‌.. జియో

ప్రపంచాన్ని మార్చేసిన సంస్థల్లో అగ్రస్థానం


న్యూయార్క్‌: ఒకప్పుడు వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలకు భారత్‌ ఆమడ దూరంలో ఉండేది. అటువంటి పరిస్థితుల్లో మూడేళ్ల క్రితం పురుడుపోసుకున్న రిలయన్స్‌ జియో.. దేశంలో సాంకేతిక విప్లవం సృష్టించినడంలో సందేహం లేదు. అందుకనే అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును ఈ సంస్థ పొందింది. ఫార్చ్యూన్‌ రూపొందించిన ‘ఛేంజ్‌ ది వరల్డ్‌’ జాబితాలో రిలయన్స్‌ జియో అగ్రస్థానంలో నిలిచింది. ఇంటర్నెట్‌ పొందడం మానవుడి ప్రాథమిక హక్కుగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని, రిలయన్స్‌ జియో దీన్ని అమలు చేయడంలో విజయం సాధించిందని ఫార్చ్యూన్‌ పేర్కొంది. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని సంస్థ భారత్‌కు డిజిటల్‌ ఆక్సిజన్‌ అందించిందని అభిప్రాయపడింది. వార్షిక ఆదాయం బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7000 కోట్లు) మించిన కంపెనీలను ఫార్చ్యూన్‌ పరిగణనలోకి తీసుకుంది.

మొదటి 5 ఇవే..: రిలయన్స్‌ జియో, మెర్క్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, ఇండిటెక్స్‌, అలీబాబా గ్రూప్‌
తర్వాతి అయిదు: క్రోజర్‌, జైలెమ్‌, ఏబీబీ, వెయిట్‌ వాచర్స్‌ ఇంటర్నేషనల్‌, హ్యూస్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌
పరిగణనలోకి తీసుకున్న అంశాలు: ప్రపంచానికి కొత్త ఆలోచనలు ఇవ్వడం, సామాజిక సమస్యల పరిష్కారం
22 నెలల్లో జియో ఖాతాదారుల సంఖ్య: 21.5 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *