విజయనగరంలో వైసిపిదే జోరా…! వర్గాలను ఏకం చేసిన జగన్…

వచ్చే ఎన్నికల్లో వైసిపి జోరుకు జగన్మోహన్ రెడ్డి అసరమైన మార్గం ఏర్పాటు చేశారా ? పాదయాత్రలో జగన్ అనుసరిస్తున్న విధానాలను చూసిన పార్టీ నేతల్లో మంచి జోష్ కనబడుతోంది. ఆదివారం రాత్రి జగన్ పార్టీ నేతల మధ్య సయోధ్య కుదర్చటంతో అందరూ హ్యాపీగా కనబడుతున్నారు. జిల్లాలో చాలా కాలంగా బొత్సా, కోలగట్ల వర్గానికి పడటం లేదు. కోలగట్ల వీరభద్రస్వామి ఎప్పటి నుండో పార్టీలో ఉన్నప్పటికీ తర్వాత చేరిన బొత్సా సత్యనారాయణ ధాటికి తట్టుకోలేకపోతున్నారు. దాంతో బొత్సా వర్గానిదే పై చేయిఅయిపోయింది. అందుకే కోలగట్ల ఒక్కోసారి పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.

బొత్సా పార్టీలో చేరినదగ్గర నుండి పై రెండు వర్గాలది ఇదే వరస. ఇటువంటి నేపధ్యంలోనే పాదయాత్రతో జగన్ జిల్లాలోకి అడుగుపెట్టారు. పాదయాత్రలో అందరూ పాల్గొంటున్నారే కానీ అందరిలోనూ ఏదో అభద్రతా భావం కనబడుతూనే ఉంది. ఆ విషయాన్ని గమనించిన జగన్ ఆదివారం రాత్రి నేతలను కూర్చోబెట్టుకుని మాట్లాడినట్లు సమాచారం. దాని ఫలితమే విజయనగరంలో వచ్చే ఎన్నికల్లో కోలగట్ల వీరభద్రస్వామిని ఆశీర్వదించాలన్నపుడు కార్యకర్తల్లో, జనాల్లో విపరీతమైన జోష్ కనబడింది.

జగన్ విజయనగరంలో ప్రవేశిస్తున్నపుడు బొత్సా వర్గంగా గుర్తింపున్న అవనాపు సోదరులు మంచి జోష్ తో కనబడడ్డారు. ఎందుకంటే, వచ్చే ఎన్నకల్లో ఇక్కడ నుండి అవనాపు సోదరులు టిక్కెట్టు ఆశిస్తున్నారు. కోలగట్ల ఎలాగూ ఎంఎల్సీ కాబట్టి బొత్సా అండతో తమదే టిక్కెట్టన్న ధీమాతో ఉన్నారు. కానీ సోమవారం రాత్రి పర్యటనలో బహిరంగ సభలో జగన్ మాట్లుడుతూ, వచ్చే ఎన్నికల్లో తనతో పాటు కోలగట్లను కూడా ఆశీర్వదించాలన్నపుడు అందరూ ముందు నివ్వెరపోయారు. తర్వాత ఒక్కసారిగా కేరింతలతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

ఇంతకీ జగన్ హఠాత్తుగా కోలగట్లను ఆశీర్వదించమని బహిరగంగా ఎలా అడిగారు ? అంటే తెరవెనుక చేసిన కసరత్తే కారణమని సమాచారం. ఆదివారం రాత్రి కోలగట్ల, అవనాపు సోదరులు, బొత్సాతో కూర్చుని మాట్లాడారట. ఎంఎల్ఏగా కోలగట్లకు పనిచేసేట్లు అవనాపు సోదరులను ఒప్పించారట. విజయనగరగం మున్పిపాలిటీ తర్వలో కార్పొరేషన్ కాబోతోందట. అప్పుడు జరిగే ఎన్నికల్లో మేయర్ పదవిని అవనాపు సోదరులకే ఇచ్చేట్లు జగన్ హామీ ఇవ్వటంతో సోదరులు కూడా హ్యాపీ అయిపోయారు. జిల్లా మొత్తం మీద ఇక్కడే పెద్ద సమస్య. అటువంటి జగన్ చొరవతో మూడు వర్గాలు హ్యాపీ అవ్వటంతో జిల్లాలో వచ్చే ఎన్నికల్లో వైసిపి జోరును ఆపటం కష్టమనే ప్రచారం ఊపందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *