జుట్టుకు హాని కలిగించే నూనే రాసే విధానాలు ఇవే…

ఆరోగ్యకరమైన మరియు కాంతివంతమైన కేశాలకోసం నూనే రాయడం తప్పనిసరి. అయితే కొన్ని రకాల నూనే రాసే పద్దతులతో ప్రయోజనాలకంటే హాని ఎక్కువ కలుగుతుంది.

దురుసుగా రుద్దడం
వెంట్రుకలు చాల సున్నితమైనవి, అతిగా రుద్దడం వలన తెగిపోయి రాలిపోయే అవకాశం ఉంది. అలాగే, నెట్ట పైన చర్మం కూడా చల్ సున్నితంగా ఉంటుంది. అందువలన నూనే రాసినప్పుడు వెంట్రుకలను, తల పై చర్మాన్ని మృదువుగా, వలయాకారం లో నిమురుతూ ఆయిల్ మర్దన చెయ్యాల్సి ఉంటుంది. లేనిచి వెంట్రుకలు బలహీన పది ర్రలిపోయే అవకాశం ఉంది.

తడిలో నూనే రాయడం
స్నానం చేసిన వెంటనే ఆయిల్ రాయడం కూడా ప్రమాదకరమినదే. ఎందుకంటే వెంట్రుకల మోదళ్ళు చల్ల సున్నితంగా ఉండడమే కాదు, తడిగా ఉన్నప్పుడు కొంచెం ఒత్తిడికి కూడా రాలిపోయేంత మృదువుగా తయారవుతాయి. అందుకని తడిగా ఉన్నప్పుడు కాకుండా పూర్తిగా ఆరినాకే ఆయిల్ పెట్టుకోవాలి.

చివర్లకు నూనే రాయక పోవడం
చాల సార్లు ఆయిల్ రాయడం స్కాల్ప్ మరియు మొదల్లకే పరిమితం చేస్తాం, వెంట్రుకల చివరలను అంతగా ప్రాముఖ్యం ఇవ్వం. ఇలా చేయడం వలన, చివరలకు సరైన పోషణ లభించక చిట్లిపోవడం జరుగుతుంది. ఇది పెరుగుదలను ఆపడమే కాకుండా, జుట్టు రాలి పోవడానికి కూడా కారణమవుతుంది.

సరైన నూనే వాడకపోవడం
చాలామందికి నూనే అంటే కొబ్బరి నూనే అనుకుంటారు. ఇతర నూనే లను పట్టించుకోరు. కాని నూనేలలో కూడా చాల వెరైటీలు ఉన్నాయి. పోషణకు కొబ్బరి, పెరుగుదలకు బాదం మంచివి. ఇంతేకాక, అమల, శికకాయ్ లాంటి నూనెలు కూడా వివిధ రకాల జుట్టు కు సరైన పోషణ ను కలిగిస్తాయి. అందుకే సరైన నూనే ను ఎంచుకోవడం కూడా ముఖ్యమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *