మిరుమిట్లు గొలిపే చర్మానికి పాటించవలసిన 5 చర్మ సంరక్షణ మార్గాలు

తగు జాగ్రత్తలు తెసుకోవడం ద్వార దైనందిక పొల్యుషను నుండి చర్మాని సంరక్షించుకోవడమే కాకుండా మెరుగైన స్కిన్ ను పొందవచ్చు.

పడుకునేముందు పేస్ వాష్ చేసుకోవడం
పడుకోకునే ముందు మొహం కడుక్కోవడం తప్పనిసరి. ఇది దుమ్ము, ధూళి మరియు ఇతర మలినాలను నిర్మూలించి చర్మాన్ని శుబ్రపరుస్తుంది.మేకప్ లాంటివి తీసేయడం కూడా తప్పనిసరి. శుభ్రపరచడం తో పాటుగ ఏదైనా నైట్ క్రీం రాసుకోవడం తో చర్మం పునరుజ్జివనం పొందుతుంది.

బయటకు వెళ్ళేముందు సన్ స్క్రీన్ లోషన్ ను రాయడం
మీకు అవుట్ డోర్ అంటే ఎంత ఇష్టమైనప్పటికి బయటకు వెళ్లేముందు సన్ స్క్రీన్ లోషన్ ను రాయడం మర్చిపోవద్దు. సన్ స్క్రీన్ ప్రీ మెచ్యూర్ ఎజింగ్ ను నిరోదిస్తుంది. SPF 15 లేదా అంతకు మించి ఉన క్రీములు ఆల్ట్రా వయలేట్ కిరణాల దుష్పరిణామాల నుండి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.

సరిపడ నీళ్ళు త్రాగడం
మంచి నీళ్ళు సరైన మోతాదులో తాగడం వలన శారిరంలోనుండి వివిధ మలినాలు తొలిగిపోయి చర్మ ఆరోగ్యం మరియు సౌందర్యం మెరుగుపడుతుంది.

ఒత్తిడి కి దూరంగా ఉండడం
ఒత్తిడి, అందోళన శరీరం తో పాటుగా చర్మం పై కూడా ప్రభావాన్ని చూపుతాయి. చర్మాన్ని నిర్జీవంగ తయారు చేస్తాయి. దీనికై ఉల్లాసవంతమైన జీవన శైలి ని అలవర్చుకోవడం ఉత్తమం.

సుఖనిద్ర పోవడం
శరీరం మరియు చర్మాన్ని పునరుజ్జివనం చేయడంలో నిద్రదే ప్రాముక్యమైన పాత్ర. క్రమం తప్పక 6 నుండి 8 గంటలు పడుకోవడం తప్పనిసరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *