బంగారం ధర ఎంత తగ్గిందంటే?

దిల్లీ: నిన్నటి ట్రేడింగ్‌లో రూ.150 పెరిగిన బంగారం ధర నేడు అమాంతం పడిపోయింది. డిమాండ్‌ లేమి కారణంగా గురువారం బంగారం ధర భారీగా తగ్గింది. రూ.365 తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.30,435గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ లేమి కారణంగా పసిడి ధర భారీగా పడిపోయినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. ఇక అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గింది. 0.65శాతం తగ్గడంతో ఔన్సు 1,215.50 డాలర్లు పలికింది.

బంగారం బాటలోనే వెండి పయనించింది. రూ.50 తగ్గడంతో కిలో వెండి రూ.39,000కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లేకపోవడంతో వెండి ధర తగ్గుముఖం పట్టినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. దేశ రాజధానిలో 99.9% పసిడి రూ.30,435గా ఉండగా.. 99.5% బంగారం ధర రూ.30,285గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *