కోడలికి కానుక కోట్లలోనే…!

 


అవును ఆ కానుక విలువ 300 కోట్ల రూపాయలు. ఇచ్చిందెవరో కాదు… నీతా అంబానీ. అదీ తన కోడలు శ్లోకా మెహతాకు. ఈనెల తొమ్మిదిన ముంబయిలో ముఖేష్‌, నీతా అంబానీల కుమారుడు ఆకాష్‌ అంబానీకి, అతని చిన్నప్పటి స్నేహితురాలు శ్లోకా మెహతాకు అత్యంత వైభవంగా వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన కోడలు శ్లోకాకు నీతా అంబానీ పెళ్లి కానుకగా వజ్రాల నెక్లెస్‌ను బహూకరించారు. మొదట నీతా అంబానీ తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న బంగారం హారాన్ని కోడలికి పెళ్లిలో కానుకగా ఇవ్వాలనుకున్నారట. కానీ దానికి భిన్నంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన నగను ఎంపిక చేయాలనుకున్నారు. దాంతో వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన నెక్లెస్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించి శ్లోకా మెడలో అలంకరించి మరీ నీతా మురిసిపోయారు. అయితే, శ్లోకాకు అత్తింటి నుంచి ఇంతటి విలువైన కానుక అందడం ఇది మొదటిసారేం కాదు. వివాహం నిశ్చయమైన తరువాత ఆకాష్‌ తన ప్రేమకు గుర్తుగా పూర్తిగా బంగారం పూతతో ప్రత్యేకంగా తయారు చేసిన ఏడు కోట్ల రూపాయల విలువైన కారును కానుకగా అందించాడట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *