బ్లాక్‌ బెర్రీ ఎవాల్వ్‌ ఎక్స్‌ వచ్చేసింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ ఫోన్ల సంస్థ బ్లాక్‌బెర్రీ రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను గురువారం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇటీవల కీ2 పేరుతో క్వర్టీ కీబోర్డు+టచ్‌ స్క్రీన్‌తో ఓ ఫ్లాగ్‌షిప్‌ మొబైల్‌ను తీసుకురాగా, తాజాగా బ్లాక్‌బెర్రీ ఎవాల్వ్‌, ఎవాల్వ్‌ ఎక్స్‌ పేరుతో రెండు ఫుల్‌ టచ్‌ స్క్రీన్‌ మొబైల్స్‌‌ను తీసుకొచ్చింది. ఎవాల్వ్‌ ఎక్స్‌ ధర రూ.34,990 కాగా, ఎవాల్వ్‌ ధరను రూ.24,990గా నిర్ణయించారు.

బ్లాక్‌ బెర్రీ ఫోన్లంటే భద్రతకు మారుపేరు. అదే స్థాయిలోనూ ఈ మొబైల్స్‌ను తీర్చిదిద్దింది. ఇందులో ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను సైతం జోడించినట్లు బ్లాక్‌బెర్రీ తెలిపింది. రెండు ఫోన్లు బ్లాక్‌బెర్రీకి చెందిన డీటెక్‌ సెక్యూరిటీ యాప్‌ను కలిగి ఉంటాయి.

బ్లాక్‌బెర్రీ ఎవాల్వ్‌ ఎక్స్‌ ఫోన్‌ను ఆగస్టు చివరి నుంచి విక్రయానికి తీసుకొస్తుండగా, ఎవాల్వ్‌ను సెప్టెంబరు మధ్యలో వినియోగదారులకు అందుబాటులోకి తెస్తారు. ఈ రెండు ఉత్పత్తులు ప్రముఖ ఆన్‌లైన్‌ రీటైలర్‌ అమెజాన్‌ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా లభించనున్నాయి. ప్రారంభ ఆఫర్‌ కింద రిలయన్స్‌ జియోపై రూ.3,950 క్యాష్‌బ్యాక్‌ లభించనుండగా, ఐసీఐసీఐ క్రెడిట్‌కార్డు వినియోగదారులు 5శాతం తగ్గింపును పొందవచ్చు.

బ్లాక్‌బెర్రీ ఎవాల్వ్‌ ఎక్స్‌ ఫీచర్లు ఇలా..
* 5.99 అంగుళాల తాకే తెర
* కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌
* ఆండ్రాయిడ్‌ 8.1
* స్నాప్‌డ్రాగన్‌ 660 ప్రాసెసర్‌
* 6జీబీ ర్యామ్‌
* 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
* మైక్రోఎస్డీ కార్డు సహాయంతో 256జీబీ వరకూ మెమొరీని పెంచుకునే అవకాశం
* 12+13 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
* 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా విత్‌ ఫ్లాష్‌
* 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
* క్విక్‌ఛార్జింగ్‌ 3.0కు సపోర్ట్‌
* డాల్బీ అట్మాస్‌ సౌండ్‌
* సర్కిలర్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌

బ్లాక్‌బెర్రీ ఎవాల్వ్‌ ఫీచర్లు ఇలా..
* 5.99 అంగుళాల తాకే తెర
* కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌
* ఆండ్రాయిడ్‌ 8.1
* స్నాప్‌డ్రాగన్‌ 450 ప్రాసెసర్‌
* 4జీబీ ర్యామ్‌
* 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
* మైక్రోఎస్డీ కార్డు సహాయంతో 256జీబీ వరకూ మెమొరీని పెంచుకునే అవకాశం
* 13+13 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
* 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా విత్‌ ఫ్లాష్‌
* 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
* క్విక్‌ఛార్జింగ్‌ 3.0కు సపోర్ట్‌
* డాల్బీ డిజిటల్‌ సౌండ్‌
* స్క్వేర్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *