భారత్‌×విండీస్‌: ఎవరి బౌలింగ్‌ మెరుగు…?

రాజ్‌కోట్‌: వెస్టిండీస్‌ పర్యటనకు టీమిండియా సిద్ధమైంది. ఇంగ్లాండ్‌ పర్యటనలో 1-4తో టెస్టు సిరీస్‌లో ఓటమి పాలైన కోహ్లీసేన విండీస్‌పై గెలవాలని పట్టుదలతో ఉంది. కోహ్లీ లేకున్నా ఆసియాకప్‌లో భారత్‌ విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. ఎరుపు బంతి క్రికెట్‌లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న టీమిండియా జేసన్‌ హోల్డర్‌ నేతృత్వంలోని కరీబియన్‌ జట్టు బౌలింగ్‌ దాడిని ఎలా ఎదుర్కొంటుందన్నదే సందేహం!

విండీస్‌తో పోలిస్తే టీమిండియా బౌలింగ్ ‌దాడి చాలా చాలా బాగున్నా 2018లో గణాంకాలు మాత్రం ప్రత్యర్థికే అనుకూలంగా ఉన్నాయి. వారిని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాయి. ఈ ఏడాది ఆడిన 5 టెస్టుల్లో కరీబియన్‌ బౌలర్ల బౌలింగ్‌ సగటు 18.04. మిగతా ఏ జట్టుతో పోల్చినా సగటు, స్ట్రైక్‌రేట్‌, ఇన్నింగ్స్‌ల్లో వికెట్ల విషయంలో వారిదే అగ్రస్థానం. 5 టెస్టుల్లో 94 వికెట్లు తీసిన ఆ జట్టు సగటు 18.04. స్ట్రైక్‌రేట్‌ 35.50. ఒక్కో ఇన్నింగ్స్‌కు వికెట్లు 9.40. టీమిండియా 9 టెస్టులాడి 158 వికెట్లు తీసింది. మిగతా గణాంకాలు 25.25, 35.50, 9.29గా ఉన్నాయి.

సీమర్లకు అనూలించే పిచ్‌లపై భారత్‌ మంచి ప్రదర్శనే చేసింది. అయితే విండీస్‌ పేసర్లు 5 మ్యాచుల్లో 84 వికెట్లు తీశారు. సగటు 16.95. ఇక స్ట్రైక్‌రేట్‌ 32.70. భారత పేసర్లు 9 మ్యాచుల్లో 119 వికెట్లు పడగొట్టారు. సగటు 25.05, స్ట్రైక్‌రేట్‌ 48.40గా ఉంది. ఈ నేపథ్యంలో కరీబియన్‌ వీరులను తక్కువ అంచనా వేయొద్దన్నది విశ్లేషకుల సూచన!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *