ఏ ఫర్‌ యాపిల్‌ బీ ఫర్‌ బెటర్‌ యాపిల్‌

కొత్తా యాపిలండీ!!

సరికొత్త అప్‌డేట్స్‌తో యాపిల్‌ సందడి మొదలయ్యింది. గత వారం జరిగిన వరల్డ్‌ వెబ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ (డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఐఓఎస్‌ కొత్త వెర్షన్లను పరిచయం చేసింది. దీంతో యాపిల్‌ ఫోన్‌లో వినూత్న సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి..

మెసెంజర్‌లో మార్పులు..

టెక్స్ట్‌ మెసేజ్‌లను ఐక్లౌడ్‌లో భద్రం చేసుకోవడంతో పాటు పలు రకాల కొత్త సౌకర్యాల్ని మెసేజింగ్‌ యాప్‌లో చూడొచ్చు. డార్క్‌మోడ్‌, కొత్త ఎమోజీ యానిమేషన్‌లు, డార్క్‌ థీమ్‌ కీబోర్డు.. ఇంకా ఎన్నో.
గుర్తు తెలియని కాల్స్‌ వస్తే..

ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఫోన్‌ రింగ్‌ అవుతుంది. చూస్తే.. గుర్తు తెలియని ఫోన్‌ నంబర్‌. లిఫ్ట్‌ చేస్తే.. వాణిజ్య ప్రకటనకి సంబంధించిన ఐవీఆర్‌ కాల్‌. చేసేదేం లేక కట్‌ చేశారు.. ఇలాంటి సమస్యకి పరిష్కారంగా గుర్తు తెలియని నంబర్స్‌ (అన్‌నోన్‌ కాలర్స్‌) నుంచి వచ్చే కాల్స్‌ని యాపిల్‌ ఫోన్‌ మ్యూట్‌ చేసేస్తుంది. ఆప్షన్‌ ఎనేబుల్‌ చేస్తే అన్‌నోన్‌ కాల్స్‌ని ఆటోమేటిక్‌గా సైలెంట్‌లో పెట్టేస్తుంది.
ఆఫ్‌లైన్‌లోనూ చూడొచ్చు

ఫోన్‌ని పోగొట్టుకుంటే ‘ఫైండ్‌ మై ఫోన్‌’ సాయంతో ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అయితే, ఫోన్‌ నెట్‌కి అనుసంధానమైనపుడే ఇది సాధ్యం. ఆఫ్‌లైన్‌లో ట్రాక్‌ చేయడం కష్టమే. కానీ, యాపిల్‌ యూజర్లు ఇకపై కొత్త ఓఎస్‌తో పోగొట్టుకున్న వాటిని ఆఫ్‌లైన్‌లోనూ ట్రాక్‌ చేయొచ్చు.
కట్టుదిట్టమైన ప్రైవసీ..

వాడుతున్న మెయిల్‌ ఐడీతో ఏవేవో సర్వీసుల్లో లాగిన్‌ అవుతుంటాం. ఉదాహరణకు ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో పలు యాప్‌లను వాడే క్రమంలో జీమెయిల్‌తోనే లాగిన్‌ అవుతాం. ఇలా మన ఐడీని పలు సర్వీసుల్లో వాడడంతో పలు రకాల స్పామ్‌ మెయిల్స్‌ వస్తుంటాయ్‌. ఇలాంటి సమస్య ఇకపై యాపిల్‌ యూజర్లకు రాదు. ఎందుకంటే.. దేంట్లోనైనా యాపిల్‌ ఐడీతో సైన్‌ఇన్‌ అయితే ఒరిజినల్‌ ఐడీ షేర్‌ అవ్వదు. ఎప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా ఓ ఐడీని యాపిల్‌ జనరేట్‌ చేసి ఇస్తుంది. దీంతో అధికారిక మెయిల్‌ ఐడీ థర్డ్‌ పార్టీ సర్వీసుల కంట్లో పడదు.
వీడియో ఎడిటింగ్‌..

ఐఓఎస్‌ 13 రాకతో యూజర్లు ఫోన్‌లోనే వీడియోలను ఎడిట్‌ చేసుకోవచ్చు. ఎలాంటి థర్డ్‌ పార్టీ యాప్‌లతో పని లేదు. బిల్ట్‌ఇన్‌గా అందించే ఎడిటింగ్‌ ఆప్షన్స్‌తో వీడియోలను మరింత ఆకట్టుకునేలా మార్చేయొచ్చు.
తక్కువ వెలుతురులో…

తక్కువ వెలుతురులో ఫొటోలు తీస్తే నాణ్యత లోపిస్తుంది. తరచి చూస్తే చుక్కలు చుక్కలుగా (-్నi(’) పిక్సల్స్‌ అవుట్‌ అయినట్టుగా ఫొటోలు కనిపిస్తాయి. అలాంటప్పుడు నాయిస్‌ని ఫొటో ఎడిటింగ్‌లో కాకుండా మాన్యువల్‌గా మార్చుకునే వెసులుబాటుని ఐఓఎస్‌13 ఓఎస్‌లో అందిస్తున్నారు. ఐఫోన్‌లో ఇకపై ‘నాయిస్‌ రిడక్షన్‌’ ఆప్షన్‌ని యాక్సెస్‌ చేయొచ్చు.
బ్లాక్‌ చేయొచ్చు

ఇప్పటి వరకూ స్క్రీన్‌టైమ్‌ సౌకర్యంతో ఫోన్‌ వాడకంపై ఓ కన్నేస్తు¦్నరు. ఇకపై అదే స్క్రీన్‌టైమ్‌ యాప్‌తో ఏవైనా యాప్స్‌ని (విభాగాల వారీగా..) బ్లాక్‌ చేసే అదనపు సౌకర్యాన్ని కొత్త ఓఎస్‌లో పొందొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *