‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ కాన్సెప్ట్‌ టీజర్‌ విడుదల…


హైదరాబాద్‌: మాస్‌ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అమర్‌ అక్బర్ ఆంటోనీ’. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రవితేజ.. అమర్‌, అక్బర్, ఆంటోనీగా త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈరోజు శ్రీనువైట్ల పుట్టినరోజును పురస్కరించుకుని పివట్‌ టీజర్‌ (కాన్సెప్ట్‌ టీజర్‌)పేరిట చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. టీజర్‌లో ముగ్గురు రవితేజలను విభిన్న గెటప్స్‌లో చూపించారు. అమర్‌ కాషాయ రంగు దుస్తుల్లో ఓ మూలకు కూర్చుని దిగాలుగా చూస్తుంటే, అక్బర్‌ భవనంలో నుంచి బైనాక్యులర్‌తో చూస్తూ కన్పించారు. ఆంటోనీ స్టైల్‌గా జీన్స్‌ టీషర్ట్‌ వేసుకుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా చూపించారు.

ఈ చిత్రంలో రవితేజ హిందువు, ముస్లిం, క్రిస్టియన్‌ పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇలియానా కథానాయికగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క రవితేజ-సంతోష్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోంది. కాజల్‌, కేథరిన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. దీని తర్వాత రవితేజ.. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలోనూ నటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *