‘అదుగో’ టీజర్‌ విడుదల…


హైదరాబాద్‌: విభిన్న కథలతో, పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించే నటుడు రవిబాబు. ఆయన దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం ‘అదుగో’. సురేశ్‌ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఇందులో పందిపిల్ల ముఖ్య పాత్ర పోషించడం విశేషం. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో ‘బంటి’ పాత్రలో సందడి చేయనున్న పందిపిల్లను పరిచయం చేశారు. ఓ బాలుడు చెప్పింది ‘బంటి’ చేస్తూ కనిపించింది. ఈ ప్రచార చిత్రం చాలా ప్రత్యేకంగా ఉంది.

‘ఏ బంటి.. ఎక్కడున్నావ్‌. ఏ దొంగ నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు. రా బయటికి.. బంటి ఈజ్‌ ఎ గుడ్‌ బాయ్‌. కమ్‌.., డౌన్‌.. డౌన్‌.., రోల్‌.. రోల్‌.., స్టాండప్‌.. గుడ్‌. నేను సాంగ్‌ పెడుతా నువ్వు డ్యాన్స్‌ చెయ్యి.. ఏంటి ఆ పిచ్చి డ్యాన్స్‌.. మళ్లీ ప్లే చేస్తా.. మళ్లీ చేయ్యి’ అంటూ పందిపిల్లతో బాబు మాట్లాడుతున్నట్లు చూపించారు.

‘అదుగో’ను అన్ని భారతదేశ భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించారు. దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి పూర్తిస్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్‌ను చూపిస్తోన్న సినిమా ఇదని పేర్కొన్నారు. అందుకే ఈ చిత్రాన్ని వీలైన‌న్ని భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నట్లు తెలిపారు. తెలుగులో ‘అదుగో’ టైటిల్‌తో రానున్న ఈ చిత్రం.. మిగిలిన భాష‌ల్లో మాత్రం ‘బంటి’ పేరుతో విడుద‌ల కాబోతోందని అన్నారు.\

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *