Cinema News

షాకింగ్ : మహేష్‌, బన్నీ, ఎన్టీఆర్‌ ఒకే సినిమాలో…?

ntr

మహేష్‌ బాబు, బన్నీ, ఎన్టీఆర్‌ ఇప్పుడు కెరీర్‌ పరంగా బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురు సంక్రాంతి బరిలో ప్రేక్షకులను పలకరించనున్నారు. అదేంటి ఆ ముగ్గురి సినిమాలు ఇప్పుడేం లేవు కదా అని అనుకుంటున్నారా…? మరేం లేదండి ఈ ముగ్గురు శర్వానంద్‌ నటించిన ‘శతమానం భవతి’ సినిమాలో కనిపించనున్నారు.

ఇందులో వారు నటించనప్పటికీ, అంతకుముందు వీరు నటించిన సినిమాలలో కొన్ని క్లిప్పింగ్స్‌ను ఎడిట్‌ చేసి ఇందులో పెట్టారట. అంతేకాకుండా ఈ మూవీ కోసమే వారు నటించారు అనే విధంగా ఆ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తాత మనమళ్ల మధ్య అనుబంధంగా తెరకెక్కిన సినిమాపై ఇప్పటికే పాజిటివ్‌ బజ్‌ ఉండగా, ఇప్పుడు ఈ వార్తతో సినిమాపై మరింత అంచనాలు పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘శతమానం భవతి’. ఇందులో శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌, ప్రకాష్‌ రాజ్‌, జయసుధ, ఇంద్రజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Leave a Comment