Cinema News

అవసరాల శ్రీనివాస్ కు ఉహించని మెగా ఫ్యామిలి ఆఫర్…

ram charan

ప్రస్తుతం ఇదే టాపిక్ పిల్మ్ నగర్‌లో ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తోంది. అవసరాల శ్రీనివాస్ అల్లు అరవింద్‌ని వ్యక్తిగతంగా కలిశాడు. అవసరాలకు అల్లు అరవింద్ భారీ ఆఫర్ ఇచ్చాడట. రామ్అ చరణ్ అల్లు అర్జున్ తో సహా ఎవ్వరికైనా సరే సరిపడే కథ ఉంటే చెప్పు…..గీతా ఆర్ట్స్ బేనర్‌పైన సినిమా చేసేద్దాం అని చెప్పాడట. అలాగే ఫిమేల్ ఓరియెంటెడ్ అయినా హీరోయిన్‌కి బాగా ఇంపార్టెన్స్ ఉండే కథ ఉన్నా చెప్పు…..నిహారికతో సినిమా చేసేద్దాం అని చెప్పాడట.

మెగా కాంపౌండ్ నుంచి ఆ స్థాయి ఆఫర్ రావడంతో ఇప్పుడు అవసరాల పునరాలోచనలో పడ్డాడట. ఎలా అయినా క్రికెట్ టీం అంతమంది హీరోస్ ఉన్న ఫ్యామిలీ కదా. అందుకే మెగా ఫ్యామిలీ నుంచి ఆఫర్ వస్తే ఏ డైరెక్టర్ కూడా వదులుకోడు. పైపెచ్చు మెగాఫ్యామిలీకుండే అభిమానుల రేంజ్, సంఖ్య కూడా ఇంకెవ్వరికీ లేదు. రామ్ చరణ్, అల్లు అర్జున్‌లాంటి వాళ్ళతో సినిమా చేస్తే ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోవచ్చు.

ఇక ఇప్పటికే గీతా ఆర్ట్స్ లో మగధీర,సరైనోడు సినిమా వసూళ్ళ పరంగా ఆల్ టైమ్ బెస్ట్ గా నిలిచాయి. అలాగే అవసరాలు శ్రీనివాస్ ఉహలు..ఉహలు గుసగుస లాడే రీసెంట్ గా వచ్చినా జో అచ్చుతానంద తో సినిమా లతో యూత్ మంచి పేరు సంపాదించాడు.

ఇక ఏ పవన్ కళ్యాణ్‌తోనో,రామ్ చరణ్ తోనో,బన్నీ తోనో ఆఫర్ వచ్చి, ఆ సినిమా హిట్ అయితే మాత్రం …ఆ వెంటనే 8 నుంచి 10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోవచ్చు. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బీభత్సంగా పెరిగిపోతుంది. అందుకే ఇఫ్పుడు అవసరాల కూడా డైలమాలో పడ్డాడట. ఇప్పుటి వరకూ చేసిన రెండు సినిమాలు కూడా బోలెడన్ని బడ్జెట్ పరిమితుల మధ్యే తెరకెక్కించాడు అవసరాల. ఒక్క సారి మెగా ఫ్యామిలీలో ఉన్న ఏ ఒక్క స్టార్ హీరోతో సినిమా ఒకె అయిందంటే తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందించే అవకాశం కూడా మనవాడికి వస్తుంది. చూడాలి మరి….అవసరాల ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో? నానీతోనే కమిట్ అవుతాడో? లేక మెగా కాంపౌండ్‌లోకి జంప్ చేస్తాడో?
ram charan

Leave a Comment