A.P News Political news

జలీల్ ఖాన్ కి దిమ్మ తిరిగే సమాదానం ఇచ్చిన జగన్…!

jagan-ajlil-khan-image-mastistreet

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో జలీల్ ఖాన్ వీడియో ఒకటి యమ ట్రెండింగ్ అవుతుంది. ఓ ఎమ్మెల్యే స్ధాయిలో ఉన్న వ్యక్తికి కనీసం చదువుల గురించి తెలియదా అంటూ నెటిజన్లు ఆ వీడియోను తెగ షేర్లు చేశారు. కనీసం డిగ్రీ పాసు కాకుండా…, అందులో కనీస సబ్జెక్ట్ లు ఏమున్నాయో తెలియకుండా.. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలనే భ్రష్టు పట్టిస్తున్నారన్న రేంజ్ లో కామెంట్లు షికారు చేశాయి. కామర్స్ లో ఏ సబ్జెక్ట్ లుంటాయో తెలియదా జలీల్ ఖాన్ అంటూ.. నెటిజన్లు ఈ సంవత్సరపు జోక్ ఆప్ ది ఇయర్ అంటూ సెటైర్లు వేశారు. పైగా తను అన్న మాట మీదే నిలబడుతున్నా.. కావాలనే సదురు మీడియా ఇలా చేసిందంటూ.. మరో వీడియో పెట్టాడు.

ఇలా ఈ వీడియో తిరిగి తిరిగి జగన్ దగ్గరికి చేరిందని సమాచారం. వైసీపీలోని ఓ కీలక నేత జగన్ తో పని ఉండి జగన్ దగ్గరికి వెళ్లాడంట. అయితే మాటల మధ్యలో విజయవాడ గురించి ప్రస్ధావన వచ్చి.. జలీల్ ఖాన్ వీడియో గురించి కూడా చర్చకు వచ్చిందంట. జగన్ తో ఆ నేత అన్నా.. గత వారం రోజులుగా సోషల్ మీడియా జలీల్ ఖాన్ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో మీరు చూశారా.. అని అడిగాడంట. జగన్ చూడలేదని.. విషయం మాత్రం తెలిసింది అంటూ.. చిరు నవ్వు నవ్వాడంట. వెంటనే ఆ నేత జగన్ చూడలేదని ఆ వీడియో తన ఫోన్ లో ఉంటే.. చూపించాడంట. ఆ వీడియో చూసిన జగన్ జలీల్ ఖాన్ మాటలు విని పగలబడి నవ్వాడంట. అంత మంది ఉన్నారని కూడా చూడకుండా.. చిన్న పిల్లాడి మాదిరి నవ్వాడంట.

దీంతో అక్కడున్న వారిలో ఓ నేత. జగన్ అన్నా .. ఇదే సమయంలో జలీల్ ఖాన్ మన పార్టీలో ఉంటే పరిస్ధితి ఏంటని అడిగాడంట. దీంతో జగన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి… విజ్ఞత, అబద్దాలు చెప్పటం, సంస్కారం ఇవన్ని ఆ వ్యక్తికే ఉంటే.. ఇలా పార్టీ మారేవాడు కాదన్నా.. అని సమాధానం చెప్పాడంట. అబద్దాలు చెప్పటం, నమ్మక ద్రోహం చేయటం తెలిసిన వాళ్లు ఇలాగే పరువు తీసుకుంటారని చెప్పి.. అక్కడి నుంచి ఏదో మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్లి పోయాడంట. ఈ మాట విన్న సదురు నేతలు అవును నిజమే అని సమాచారం.

Leave a Comment