General News

మహిళపై కత్తితో దాడి…

crime-news-image-mastistreet

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఆదివారం అర్థరాత్రి ధనలక్ష్మి అనే మహిళపై చంద్రశేఖర్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. శరీరంపై కత్తితో పలుచోట్ల గాయపరిచాడు. స్థానికులు ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Comment