General News

వివాహానికి ముందు ఆ తప్పు చేస్తున్నారా…!

romance-images-mastistreet

పెళ్లికి ముందే చాలా మంది యువతులు తమకు నచ్చిన యువకులతో చాలా చనువుగా ఉంటుంటారు. అలాంటి వారు ఎవరూ లేని సమయంలో ఆక‌ర్ష‌ణ‌కు లోన‌య్యి కాస్త హ‌ద్దులు మీరుతారు. ముందు ముద్దుల‌తో మెద‌లు పెడ‌తారు. త‌ర్వాత వారు ఎక్క‌డికో వెళ్లిపోతారు. ప్రేమికుల్లో కొంద‌రు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు.

దీన్ని అవకాశం తీసుకున్న కొందరు యువకులు పెళ్లికి ముందే సెక్స్‌కు ప్రపోజ్ చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో యువతి ముందుగా సెక్స్‌కు చొరవ చూపొచ్చు. అయితే పెళ్లికి ముందే యువ‌తులు సెక్స్‌కు ఇంట్ర‌స్ట్ చూప‌డం వ‌ల్ల చాలా న‌ష్టాలు ఉంటాయి.

పెళ్లికి ముందు ముద్దులు ముచ్చట్లూ సర్వ సాధారణమే అయినా శారీరకంగా కలుసుకోకూడ‌దు. ఎలాగూ, కాబోయే దంపతులం కదా అని ఒత్తిడి తీసుకువచ్చినా… అతడికి ఏమీ నష్టం ఉండదు. పైపెచ్చు… కాబోయే దంపతులం కదా అని సెక్స్‌కు ముందు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే యువ‌తుల‌కు గ‌ర్భం వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. ఇలా జ‌రిగితే స‌మాజంలో యువ‌తుల‌కే మైన‌స్ అవుతుంది. ఇక ఆ త‌ర్వాత గ‌ర్భం తీయించినా వారికి ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

ప్రపోజల్ తెచ్చి ఒత్తిడి చేసి సెక్స్‌లో పాల్గొనేలా చేసిన వారు.. చివరకు ఆ విషయాన్ని మరిచి పోయి చులకనగా చూడటం ఆరంభిస్తాడు. ఇక గర్భం వస్తే అబార్షనే గతి. దానివల్ల ఒక్కోసారి అండాన్ని మోసుకుపోయే అండవాహికల్లో బ్లాక్స్ ఏర్పడి మూసుకుపోయి భవిష్యత్తులో పిల్లలు పుట్టకుండా పోయే ప్రమాదమూ లేకపోలేదు. మానసికంగా ఒత్తిడికి, అవమాన భారానికి గురి కావాల్సి వస్తోంది. దీంతో యువ‌తులే పెళ్లికి ముందు సెక్స్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Leave a Comment